పల్లె అంతా ఏకమై ప్రగతిలో భాగమైనా చిన్నమందడి :: సూర్యచంద్రారెడ్డి, సర్పంచ్‌

  • విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ ఏర్పాటు
  • 2012నుంచి పల్లెప్రగతి అమలు
  • సంపూర్ణ మద్యపాన నిషేధం
  • 2018లో ఆదర్శ గ్రామంగా ఎంపిక
  • కేంద్రం నుంచి రూ.7.5లక్షల బహుమతి
  • చిన్నమందడి గ్రామం పెద్ద అభివృద్ధి..

గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం, అధికారుల కంటే గ్రామస్తులే ఎక్కువగా కృషిచేయాల్సి ఉంటుంది.. తమ గ్రామాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన ఆ గ్రామంలోని ప్రతి పౌరుడికి కలిగితేనే సాధ్యమవుతుంది.. ఇదే ఆలోచనలను పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామస్తులు తొమ్మిదేండ్ల కిందటే చేపట్టారు. అందరి సహకారంతో ఆదర్శంగా నిలిచిన చిన్నమందడి గ్రామం

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిన్నమందడి గ్రామస్తులు చేసిన పెద్ద ఆలోచనతో ఆదర్శగ్రామంగా గుర్తింపు పొందింది. రాష్ట్ర ప్ర భుత్వం నిర్వహిస్తున్న పల్లెప్రగతి కార్యక్రమా న్ని ఈ గ్రామస్తులు 2012నుంచే చేపడుతున్నారు. విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీని ఏర్పా టు చేసి గ్రామాన్ని శుభ్రంగా మార్చేశారు. సం పూర్ణ మద్యపాన నిషేధాన్ని చేపట్టి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న గ్రామాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి 2018లో స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డుతోపాటు నగదు బహుమతి అందించారు.

ప్రతి ఇంటి ప్రహరీకి వేసిన పెయింటింగ్స్‌, దాతల సహకారంతో నిర్మించిన భవనాలు గ్రామానికే వన్నెతెచ్చాయి. తమ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలనే ఆలోచనతో గ్రామంలోని ప్రతి ఒక్కరూ పదేండ్ల కిందటే శ్రీకారం చుట్టారు. ఇందుకోసం గ్రామ ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీనీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ తీసుకొచ్చిన మార్పులతో చిన్నమందడి గ్రామం ఆదర్శగ్రామంగా నిలిచింది.

విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ

2012లో గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు, సమస్యలను పరిష్కరించుకునేందుకు విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీలో గ్రామంలోని 7 ప్రధా న కులాల నుంచి ఒక్కో కులం నుంచి ఇద్దరు చొప్పున 14మంది సభ్యులును నియమించా రు. రెండేండ్లకోసారి కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులతోపాటు సభ్యులను కొత్తగా ఎన్నుకుంటూ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఏర్పడిన నాటి నుంచి చిన్నమందడి గ్రామ రూపురేఖలు మారిపోయాయి.

గ్రామాన్ని శు భ్రంగా మార్చేందుకు కమిటీ ఆధ్వర్యంలో గ్రా మస్తులు స్వచ్ఛందగా పారిశుధ్య పనులు, హరితహారం కార్యక్రమం చేపట్టారు. గ్రామస్తుల్లో అవగాహన కల్పించి 2014నాటికి ప్రతి ఇంటి కీ మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసుకున్నారు. గ్రామస్తులు మద్యానికి బానిస లు కాకుండా గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. ఆరేండ్ల కిందటే హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ రైతుల సహకారంతో చందాలు వేసుకొని రైతువేదికలు చేపట్టకముందే ఈ గ్రామంలో రైతుభవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

గ్రామంలోని ప్రహరీలపై పెయింటింగ్స్‌

కేంద్ర ప్రభుత్వం అందించిన స్వచ్ఛసర్వేక్షణ్‌ అవార్డ్డుతోపాటు రూ.7.5 లక్షల నగ దు ప్రోత్సాహకాన్ని ఈ గ్రామం సొంతం చేసుకున్నది. ఈ నిధులతో గ్రామంలోని ప్రధాన రోడ్లపై ఉన్న ఇంటి ప్రహరీలకు రూ.లక్షా50వేల ఖర్చుతో పెయింటింగ్స్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లెన్స్‌ ప్రకారం గ్రామ పంచాయతీ భవనం కోసం ఆటోను కొనుగోలు చేశారు. రోడ్లకు ఇరువైపులా చెత్తకుండీలను ఏర్పాటు చేశారు. హరితహారం మొక్కల మధ్యన దాతల సహకారంతో బెంచీలను ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో 10 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

గ్రామ కమిటీతో సక్సెస్‌

మా గ్రామంలో 2012నుంచి విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీని నిర్వహిస్తున్నాం. కమిటీ ద్వారా గ్రామంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. గ్రామాన్ని శుభ్రంగా తీర్చిదిద్ది ఆదర్శగ్రామ అవార్డు సాధించగలిగాం. పారిశుధ్య కార్యక్రమాలపై పదేండ్లుగా మాగ్రామంలో అవగాహన చేపట్టాం. ఆరేండ్ల కిందట చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో ఏపుగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వ సహాయంతో గోడలకు పెయింటిగ్‌ వేశాం. పల్లెప్రగతిలో మరింత అభివృద్ధి చెందుతున్నది.
– సూర్యచంద్రారెడ్డి, సర్పంచ్‌, చిన్నమందడి

గ్రామస్తుల సహకారంతోనే..

పంచాయతీ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించకముందే ఈ గ్రామాన్ని శుభ్రంగా తీర్చిదిద్దారు. చిన్నమందడి ఆదర్శగ్రామంగా ఏర్పాటు కావడానికి గ్రామస్తుల కృషి ఎంతో ఉంది. విలేజ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ ద్వారా గ్రామ సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని గ్రామస్తుల ప్రోత్సాహంతో విజయవంతంగా చేపట్టాం. గ్రామంలో ప్రభుత్వ గైడ్‌లెన్స్‌ ప్రకారం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం.
– యాదమ్మ, పంచాయతీ కార్యదర్శి, చిన్నమందడి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *