సాగునీరివ్వడంలో కొత్త ఒరవడి…

సేద్యంలో రోజురోజుకు ఎదురవుతున్న ఒడిదుడుకులను అధిగమించి ముందుకు సాగేందుకు అన్నదాతలు ప్రత్యాయ్నాయ సేద్య విధానాలను అవలంభిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల ఆలోచనలు మారుతున్నాయి. ఎక్కడ ఎలాంటి ప్రత్యామ్నాయం కనిపించినా ఆసక్తి చూపుతున్నారు. బిందు, తుంపర సేద్యానికి ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం లేజర్‌ రెయిన్‌ పైప్‌ సేద్యం అందుబాటులోకి వచ్చింది. తక్కువ నీటితో, తక్కువ కూలీల అవసరంతో, తక్కువ నిర్వహణ ఖర్చుతో ఈ విధానం రైతులకు ఉపయోగపడుతోంది. నారు పెంచే నర్సరీలు, కొన్ని రకాల అపరాలు, వేరుశనగ, శనగ, ఆకుకూరలు తదితర తక్కువ ఎత్తులో సాగయ్యే పంటల్లో ఈ విధానాన్ని పాటిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *