ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ శ్రీ తన్నీరు రామారావు గారి అధ్యక్షతన ఏర్పాటుచేసిన ఈ సమావేశంలో భాగంగా మాచి పల్లి సర్పంచ్ గౌరవ శ్రీ బుద్ధుల పూర్ణ చంద్ర రెడ్డి గారు గ్రామంలోని విద్యుత్ సమస్యలు మరియు రాజాపూర్ సబ్ స్టేషన్ ద్వారా singaya palli ఫీడర్ కు సరఫరా అయ్యే విద్యుత్ అంతరాయం గురించి నాలుగు గ్రామాల రైతులకు కలుగుతున్న ఇబ్బందులు గురించి వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, ముఖ్యంగా గా రైతులు ట్రాన్స్ఫార్మర్ అంతరాయంతో తీసుకునే లైన్ క్లియర్ వల్ల దాదాపు వంద ట్రాన్స్ఫార్మర్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఇట్టి విషయంలో లెవెన్ కె.వి విద్యుత్ లైన్ లకు ఏ బి స్విచ్ ఏర్పాటుచేసిన చో ఆయా గ్రామాల రైతులకు విద్యుత్ అంతరాయం నుండి విముక్తి లభిస్తుందని సభ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఇట్టి సమావేశంలో లో విద్యుత్ శాఖ డైరెక్టర్లు, మరియు సి.ఎం.డి రఘుమా రెడ్డి గారు మరియు ఎలక్ట్రికల్ ఎస్ ఈ , డి ఈ సంబంధిత ఏ ఈ లు పాల్గొన్నారు. ఈ సమావేశం లో నర్సాయిపల్లి సర్పంచ్ కొమ్ము సత్యనారాయణ, తీగల పల్లి సర్పంచ్ శివారెడ్డి పాల్గొన్నారు .