హరితహారం కార్యక్రమంలో జాలపల్లి గ్రామంలో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని జాలపల్లి గ్రామంలో సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షులు,గ్రామ సర్పంచ్ చొప్పరి వరలక్ష్మి సాగర్ అధ్వర్యంలో ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.దీంట్లో భాగంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు అందజేస్తామని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాగుల సంపత్,పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్,వార్డు సభ్యులు,కో ఆప్షన్ సభ్యులు,తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు నాగులపల్లి కుమార్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *