– మైదానాల చుట్టూ నీడనిచ్చే మొక్కల పెంపకం.
– ప్రాంగణంలో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో లాంటి ఐదు రకాల క్రీడలకు కోర్టులు ఏర్పాటు
– తిమ్మజిపేట్ గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి
– క్రీడాకారులతో కలిసి వాలిబాల్ కబడ్డీ ఆటలను ఆడిన ఎమ్మెల్యే
పట్టణ,గ్రామీణ క్రీడలను ప్రోత్సహించి, క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పట్టణాలకు,ఊరికో ఆట స్థలాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని నాగర్ కర్నూల్ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు అన్నారు. గురువారం తిమ్మజిపేట్ గ్రామంలో రూ.6.30లక్షలతో ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రౌండ్లో కబడ్డీ, వాలీబాల్, ఖోఖో లాంటి ఐదు రకాల క్రీడలకు కోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది అని ఆయన అన్నారు. వీటిలో నీడనిచ్చే, ఆహ్లాదభరితంగా ఉండే మొక్కలు నాటనున్నట్లు తెలిపారు.మొదట మండలానికి రెండు గ్రామాల్లో క్రీడా మైదానాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఒక్కో క్రీడా ప్రాంగ ణానికి ఎకరం నుంచి ఎకరంన్నర స్థలాన్ని నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు.క్రీడాకారులతో కలిసి వాలిబాల్, కబడ్డీ మ్యాచ్ ఆడిన ఎమ్మెల్యే గారు, ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు