అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు…

 జిల్లా నంగునూర్ మండలం గట్లమల్యాల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పై గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభా నిర్వహించారు. త్వరలోనే మంత్రి హరీష్ రావు చేతుల మీదగా ప్రారంభోత్సవం నేపథ్యంలో నంగునూర్ తహసీల్దార్,విఆర్వో,వైస్ ఎంపీపీ రేణుక వేణు గోపాల్ చారి,ఉపసర్పంచ్ ప్రకాష్ రెడ్డి,వర్డ్ మెంబర్లు రంగు వెంకన్న,బుద్ది తిరుపతి,కార్యదర్శి,నాయకుల సమక్షంలో అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇండ్లు పేర్లను ఖరారు చేసారు.త్వరలోనే లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందజేస్తామన్నారు.పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి హరీష్ రావు లు పని చేస్తున్నారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *