జులై 4న దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి ని అధికారికంగా జరపాలని తెలంగాణ గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం (GMPS) సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస రెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆలేటి యాదగిరి మాట్లాడుతూ నాడు భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం దొరల భూసాముల రజాకార్ల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగిన సాయిధ పోరాటంలో మొట్టమొదటిసారిగా అమరత్వం పొందిన అమరవీరుడు దొడ్డి కొమురయ్య గారి వర్ధంతిని ప్రభుత్వం గతంలో అధికారికంగా జరుపుతామని ట్యాంక్ బండ్ పై విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీని తుంగలో తొక్కారని అలాగే సిద్దిపేట జిల్లా కేంద్రంలో అనేకమంది మహానుభావుల విగ్రహాలను ఏర్పాటు చేసి కేవలం దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోవడం కావాలని ప్రభుత్వం వివక్ష చూపుతోందని అన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జూలై 4న వర్ధంతిని అధికారికంగా జరపాలని సిద్దిపేట పట్టణంలో విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో గొల్ల కురుమలతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దాసరి బాలరాజు జిల్లా ఉపాధ్యక్షులు సంగెం పరశురాంలు జిల్లా కమిటీ సభ్యులు ఇరుమళ్ల ప్రశాంత్, బోడపట్ల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు