కూరెళ్ళ గ్రామ పంచాయతీ మహాత్మాగాంధీ జయంతి .. బతుకమ్మ చీరెలను పంపిణీ…

🙏🙏 ఘనంగా గాంధీ జయంతి వేడుకలు🙏🙏

కూరెళ్ళ గ్రామ పంచాయతీ ఆవరణలో జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని గ్రామ సర్పంచ్ గాజుల రమేశ్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు.

మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం గ్రామస్థులకు స్వీట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా గౌరవ సర్పంచ్ గాజుల రమేశ్ గారు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారిది ప్రత్యేకమైన స్థానం అని, శత్రువును జయించడమంటే శత్రువుపై భౌతిక దాడి చేయడం కాదని అహింసా మార్గంలో సైతం ప్రత్యర్థులను జయించడమెలాగో గాంధీ గారి జీవన విధానాలను చూసి తెలుసుకోవచ్చన్నారు. గాంధీ గారు లేకుండా భారత స్వాతంత్ర్యాన్ని ఊహించుకోలేమని నేటి యువతరం గాంధీ గారిని ఆదర్శంగా తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సర్పంచ్ గారు పేర్కొన్నారు.

💐💐💐💐💐💐💐💐

💥 తెలంగాణ ఆడబిడ్డలకు ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ఇస్తున్న ఆత్మీయ కానుక💥 @బతుకమ్మ చీర@

సర్పంచ్ గాజుల రమేశ్

కూరెళ్ళ గ్రామానికి చెందిన “ఆడబిడ్డ”లకు సర్పంచ్ గాజుల రమేశ్ గారు బతుకమ్మ చీరెలను పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా సర్పంచ్ రమేశ్ గారు మాట్లాడుతూ ఆడపడుచులకు బతుకమ్మ చీర పెట్టడమనేది తెలంగాణ సంస్కృతిలో భాగమని అన్నారు. సద్దుల బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాల మద్య జరుపుకోవాలని సీఎం కేసీఆర్ గారు చీరెల పంపిణీ కార్యక్రమం చేపట్టారని అన్నారు. ప్రపంచంలోనే ఇంత పెద్ద పండుగ మరెక్కడా జరుగదని, పండుగలు పబ్బాలకు ఆడబిడ్డలను పిలిచి ఉన్నంతలో సారెపెట్టి సాగనంపే సాంప్రదాయం తెలంగాణలో తప్పితే ప్రపంచంలో ఎక్కడా చూడబోమని అన్నారు. ఉపాధి లేక ఆకలితో సతమతమవుతున్న చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్రంలోని ప్రతి మహిళ పండుగకు కొత్త బట్టలు కట్టుకోవాలన్న ఉద్దేశంతోనే బతుకమ్మ చీరెలను అందిస్తున్నామని కాబట్టి బతుకమ్మ చీరలను వాటి ధర రూపంలో చూడకుండా పండగపూట ఒక అన్న తన చెళ్లెకు ఒక తమ్ముడు తన అక్కకు ఒక కొడుకు తన తల్లికి తనకు ఉన్నంతలో సారె(చీర) పెట్టే పద్దతిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సదుద్దేశ్యాన్ని ప్రజలందరూ అర్థం చేసుకోవాలని ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ ఆడపడుచులందరూ కేసీఆర్ గారిని ఒక అన్నలా ఒక తమ్మునిలా భావించుకోవాలని కోరారు.

పండగపూట మహిళలను నిరాశపరచకూడదనే ఉద్దేశ్యంతో ఇంతటి కరోనా కష్టకాలంలో కూడా వేలకోట్ల రూపాయల ఖర్చుకు వెనకాడకుండా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేసేందుకు దోహదపడిన గౌరవ ఎమ్మెల్యే సతీష్ బాబు గారికి, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి కూరెళ్ళ గ్రామ ప్రజలందరి తరపునా సర్పంచ్ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో.. ఉపసర్పంచ్ నముకుధర్మయ్య, కార్యదర్శి అనిల్, మార్గం తిరుపతి, గాజుల రవీంధర్, సంపంగి రాంచంద్రం, ఈగ మల్లయ్య, చిట్యాల లక్ష్మి, బండారి స్రవంతి, కో-ఆప్షన్ ఆకుల వెంకటలక్ష్మి, పొన్నాల రవీంధర్, మల్లారెడ్డి, అంగన్వాడీ టీచర్లు, సీఏలు ఆశా కార్యకర్తలు, మహిళాసంఘ సభ్యులు, కారోబార్ బందెల మల్లేశం, విఆర్ఏ వెంకటమల్లు, దొంతుల భూపతి తదితరులు పాల్గొన్నారు.