స్వాతంత్రం వచ్చినప్పుడు నుంచి రాని బస్సు ఈరోజు వికారాబాద్ ఎమ్మెల్యేగారి సహకారంతో కరీం పూర్ గ్రామానికి బస్సు రాక..

కోట్ పల్లి మండలం కరీంపూర్ గ్రామానికి స్వతంత్ర కాలం నాటి నుండి బస్సు సౌకర్యం లేదు. అలాంటిది మీతో నేను కార్యక్రమంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం కరీంపూర్ గ్రామంలో పర్యటించిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సార్ గారికి బస్సు సౌకర్యం కావాలని గ్రామస్తులు కోరగా… వెంటనే బస్సు సౌకర్యం కల్పించి, గ్రామస్తులకు అందుబాటులోకి తెచ్చి గ్రామస్తుల ప్రయాణ కష్టాన్ని తీర్చిన ఎమ్మెల్యే గారికి ఋణపడి ఉంటామని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. బస్సును ప్రారంభించిన కోట్ పల్లి మండల అధ్యక్షులు& గ్రామ సర్పంచ్ సుందరి అనిల్ ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్, మహిళా సంఘ నాయకురాలు, రైతులు,గ్రామస్తులు, టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. గ్రామంలోని లోని స్కూల్కు వెళ్లే విద్యార్థి విద్యార్థులకు ఉచితంగా బస్ పాస్ పంపిణీ చేస్తున్న కోట్ పల్లి టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు & గ్రామ సర్పంచ్ సుందరి అనిల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *