10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు సన్మానం చేసిన గ్రామసర్పంచ్ గారు.

ఈరోజు ZPHS గట్లమల్యాలలో పాఠశాల HM పి.అశోక్ గారు, నంగునూరు MEO దేశిరెడ్డి గారి ఆధ్వర్యంలో 2021-22 విద్యా సంవత్సరం10 వ తరగతిలో 9.0 GPA కంటే ఎక్కువ శాతం సాధించిన (9.0 నుండి 9.8 GPA) 18 మంది విద్యార్థినీ విద్యార్థులకు గ్రామ సర్పంచ్ టి.రమేష్ గారు ప్రత్యేక చొరవతో శాలువాలతో సన్మానం, షీల్డులు బహుకరించారు.ఈ సంవత్సరం 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని ఘనంగా సన్మానిస్తానని గతంలో ఇచ్చి మాట ప్రకారం ఆయన వారిని సన్మానించి ,అభినందించారు.
ఈ కార్యక్రమంలో నంగునూరు MEO టి.దేశిరెడ్డి గారు మాట్లాడుతూ..పాఠశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. గట్లమల్యాల పాఠశాల అంటే నాకు ప్రత్యేక అభిమానమని ,పాఠశాల అభివృద్ధికి నావంతు కృషి చేస్తానన్నారు.
గ్రామ సర్పంచ్ తిప్పని రమేష్ గారు మాట్లాడుతూ..ప్రతిభ చూపించిన విద్యార్థులను సన్మానించడం తనకు చాలా తృప్తి లనిచ్చిందన్నారు. విద్యార్థులు ఇంగ్లీష్ లో ఉపన్యాసం ఇస్తుంటే చాలా ముచ్చటేస్తుందన్నారు. తనకు చదువు విలువ తెలుసని,చదువుకుంటే ఎన్ని లాభాలో ,చదువు రాకపోతే జీవితంలో ఎంత నష్టపోతామో తనకు తెలుసన్నారు.అందుకు నా శయశక్తులా విద్యార్థులను ప్రోత్సహిస్తుంటేనే ఉంటానన్నారు. పాఠశాల అభివృద్ధి కి తన తోడ్పాటు ఎల్లవేళలా ఉంటుందన్నారు.
HM పి.అశోక్ గారు మాట్లాడుతూ ఉత్తమ ఫలితాల సాధనకు కృషి చేసిన ఉపాధ్యాయబృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.
విద్యార్థులు తమ భవిష్యత్తు లక్ష్యాలను తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం , CRP పెంటయ్య, పాఠశాల సిబ్బంది ,విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *