అరుదైన ఔషధ గుణాల తిప్పతీగ!

  • ప్రపంచలోనే తొలిసారి జన్యుక్రమ విశ్లేషణ
  •  ఐఐఎస్‌ఈఆర్‌ పరిశోధకుల బృందం ఘనత
  •  కొవిడ్‌తోపాటు ఇతర వ్యాధులకు మెరుగైన   మందులు తయారు చేసేందుకు అవకాశం

ఆయుర్వేద అద్భుతంగా పేరొందిన తిప్పతీగలో అరుదైన ఔషధ గుణాలు ఉన్నాయని భోపాల్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎ్‌సఈఆర్‌) శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచంలోనే తొలిసారి తిప్ప తీగ జన్యుక్రమాన్ని ఐఐఎ్‌సఈఆర్‌ పరిశోధకులు విశ్లేషించారు. ఇప్పటిదాకా తిప్ప తీగ జన్యు విశ్లేషణ జరగకపోవడంతో దీని ప్రత్యేకత శాస్త్రీయంగా ప్రపంచానికి ఇంతవరకు తెలియలేదని పేర్కొంటున్నారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంతోపాటు శరీరంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే లక్షణాలు ఉండడంతో కరోనా సమయంలో తిప్ప తీగకు విస్తృత ప్రచారం లభించింది. లక్షణాలు ఉన్నా, లేకున్నా.. కరోనాకు తిప్ప తీగ అద్భుత ఔషధంగా పని చేస్తుందని కొన్ని అధ్యయనాలు సైతం వెల్లడించాయి.

కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయు్‌షతో పాటు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలు ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించాయి. తాజాగా ఐఐఎ్‌సఈఆర్‌ శాస్త్రవేత్తల బృందం పరిశోధనలోనూ పలు అంశాలను గుర్తించారు. తిప్ప తీగపై మరింత అధ్యయనం చేపడితే, కొవిడ్‌తోపాటు ఇతర వ్యాధులకు మెరుగైన ఔషధాలను తయారు చేసే అవకాశం ఉంటుందని ఐఐఎ్‌సఈఆర్‌ బయాలాజికల్‌ సైన్సెస్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వివేక్‌ శర్మ తెలిపారు. శృతి మహాజన్‌, అభిషేక్‌ చక్రవర్తితో కూడిన పరిశోధక బృందం నిర్వహించిన అధ్యయన వివరాలు అంతర్జాతీయ బయాలజీ ప్రీపింట్‌ సర్వర్‌ బయోఆర్కివ్‌లో ప్రచురితమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *