నాగర్ కర్నూలు జిల్లా జిల్లాపరిషత్ CEO ఉష గారు ఊరుకొండ మండలంలోని స్థానిక గ్రామ సర్పంచ్ రాజయ్య తో కలిసి ఊరుకొండ గ్రామంలో పర్యటించారు… పర్యటన లో భాగంగా ఆమె గ్రామంలోని పల్లెప్రకృతి వనం మరియు నర్సరీ, రైతువేదిక ని సందర్శించారు ..పల్లెప్రకృతి వనం లో ఏపుగా పెరిగిన రకరకాల మొక్కల్ని చూసి, పచ్చదనం,పర్యావరణం పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రకృతివనం, ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చే విధంగా అద్భుతంగా తీర్చిదిద్దారని సర్పంచ్ ని అభినందించారు..ఎల్లప్పుడూ పచ్చగా వుండేందుకు ఎలాంటి నిర్వహణ చర్యలు తీసుకుంటున్నారని సర్పంచ్ ని అడిగి తెలుసుకుని ఇదే విధంగా భవిష్యత్తు లో కూడా కొనసాగేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు…అనంతరం నర్సరీ ని సందర్శించి నర్సరీ లలో పెంచుతున్న మొక్కల గురుంచి కార్యదర్శిని, సర్పంచ్ ని అడిగి తెలుసుకున్నారు…ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా నర్సరీలో మొక్కలు పెంచడాన్ని చూసి అభినందించారు.. నర్సరీలో పెరుగుతున్న మొక్కల రకాలు, వాటి ఉపయోగాలు అడిగి తెలుసుకున్నారు.. అదేవిధంగా పక్కనేవున్న రైతువేదిక ని కూడా ఆమె పరీశీలించారు..కార్యక్రమంలో ఆమె వెంట ఎంపీడీఓ ప్రభాకర్,ఏపీఓ,EC, TA ,PS తదితరులు పాల్గొన్నారు..